రేపు శ్రీ శనేశ్వర స్వామికి ప్రత్యేక తైలాభిషేకం
ఘనంగా విశేష పూజా కార్యక్రమాలు
వాయిస్ ఆఫ్ భారత్, కాజీపేట : శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు శ్రీ శ్వేతార్క దేవాలయంలో కొలువై ఉన్న కాకివాహన జ్యేష్ఠపత్ని సమేత శ్రీ శనేశ్వర స్వామివారికి ప్రత్యేక శని తైలాభిషేకం, విశేష పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడతాయని శుక్రవారం దేవాలయ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. శని ప్రభావం ఉన్న భక్తులు తప్పకుండా ఈ శుభ కార్యంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. పూజలో గోత్రనామాలు చదివించదలచినవారు లేదా పూజకు కూర్చునే భక్తులు రూ.151/- చెల్లించవలసి ఉంటుందన్నారు. పూజా ద్రవ్యములు దేవాలయంలోని పూజా స్టోర్‌లో లభ్యమవుతాయని, లేకుంటే భక్తులు స్వయంగా తెచ్చుకోవచ్చునని తెలిపారు. గోత్రనామాల నమోదు కోసం పేమెంట్ చేసేందుకు 93470 80055 నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపవచ్చన్నారు. చెల్లించిన రశీదు స్క్రీన్‌షాట్‌ను అదే నంబర్‌కు వాట్సాప్ చేయాలని తెలిపారు. అలాగే, మీ పేరు, గోత్రం కూడా వాట్సాప్‌లో తెలియజేయాలన్నారు. పూజా సామాగ్రి అవసరమున్నవారు 99086 29558 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
