మూడో లిస్ట్‌ పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ

మూడో లిస్ట్‌ పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ
  • మూడో జాబితాపై జగన్‌ కసరత్తు
  • గెలుపు లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక
  • తాడేపల్లికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు

(వాయిస్ ఆఫ్ భారత్, అమరావతి ): సీఎం జగన్‌ మూడో జాబితాపై కసరత్తు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్‌ డిసైడ్‌ అయ్యారు. అధికారం కోల్పోవద్దనే ఆలోచనలో గెలవని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకట్టారు. క్యాంపు కార్యాలయానికి మంత్రి గుమ్మనూరు జయరాం వచ్చారు. గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు సెగ్మెంట్‌లో ప్రత్యామ్నాయం పార్టీ హైకమాండ్‌ చూస్తున్నట్లు సమాచారం. దీంతో పెద్దలను కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని విఙప్తి చేసారు. సీఎంఓకు మైలవరం ఎమ్మెల్యే వసంత, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున రెడ్డిలు కూడా వచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయానికి దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్‌, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి వచ్చారు. పలు నియోజకవర్గాల ఇన్‌ చార్జీల మార్పులపై సీఎం వైఎస్‌ జగన్‌ కసరత్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. 2,3 రోజుల్లో 15 మందితో మూడో లిస్టును వైసీపీ విడుదల చేయనున్నట్లు సమాచారం.అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేలల్లో గెలవ లేని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ కట్‌ చేస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్‌ ఇస్తుంది. ఇప్పటికే కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ రెండు లిస్టులను వైసీపీ విడుదల చేసింది. ఇటీవల ఫస్ట్‌, సెకండ్‌ లిస్టులను పార్టీ విడుదల చేసింది. 2024 ఎన్నికల టీమ్‌పై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ అభ్యర్థుల మార్పులు పక్రియ కొనసాగుతోంది. తాజాగా మూడో లిస్ట్‌ పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్‌ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యే లుగా విజయం సాధిస్తే ..ఈసారి వారిలో కొందరికి గెలుపు అవకాశాలు లేవని సర్వేలో తేలడంతో జగన్‌ ఎమ్మెల్యేల పేర్లను, నియోజకవర్గాలను తారుమారు చేసి బరిలోకి దింపాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కాదని 11మందికి నియోజకవర్గ ఇన్చార్జులుగా ప్రకటించారు. అటుపై రెండో జాబితా కూడా విడుదల చేసి మిగిలిన ఎమ్మెల్యేలకు షాక్‌ ఇచ్చారు. రెండో జాబితాలో 27మంది నేతలను మార్చింది వైసీపీ అధిష్టానం. ఇక ఇప్పుడు మూడో లిస్ట్‌ కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈజాబితాలో కూడా 10`15మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానాలు, పేర్లు తారుమారు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో పలువురు అసంతృప్తులను అధిష్టానం బుజ్జగిస్తోంది. వారికి ఏదో విధంగా పదవులు కట్టబెడతామని హావిూతో కూల్‌ చేస్తోంది. రెండోసారి అధికారంలో రావాలని జగన్‌ ఇస్తున్న ధైర్యంతో నియోజకవర్గాలు మార్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పోటీకి సై అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *