మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం/ parkala mla revuri
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
వాయిస్ భారత్, హనుమకొండ దామెర: పరకాల నియోజకవర్గంలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్, మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌ను దృఢ సంకల్పంతో ఏర్పాటు చేస్తున్నామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెల్లలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఈ హబ్‌లో పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం (ఓరియంటేషన్ ప్రోగ్రామ్) సెర్ప్, వి-హబ్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకుముందు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆవరణలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో ఒక మహిళ ప్రాథమికంగా చిన్న పారిశ్రామికవేత్తగా అంచెలంచెలుగా ఎదగడానికి ఈ హబ్ ఒక పునాది అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, మహిళలు సాధికారతను సాధించాలని అన్నారు. వీ-హబ్ సీఈవో సీత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక బలాన్ని వీ-హబ్ అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను మాట్లాడుతూ పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్, మినీ మ్యానుఫ్యాక్చరింగ్, మహిళా డెయిరీ ఏర్పాటు గురించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, దామెర తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, వీ-హబ్ ప్రతినిధులు, పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
