మంత్రి పొన్నం పుట్టినరోజు సందర్బంగా పేదలకు అన్నం, వాటర్ పంపిణీ
వేములవాడ గోపా అధ్యక్షుడు దూలం సంపత్ గౌడ్
వాయిస్ ఆఫ్ భారత్, వేములవాడ : తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్బంగా వేములవాడలోని పేదలకు అన్నం, వాటర్ బాటిల్లు పంపిణీ చేసినట్లు వేములవాడ గోపా అధ్యక్షులు దూలం సంపత్ గౌడ్ తెలిపారు.ఈ సందర్బంగా దూలం సంపత్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వేములవాడ రాజన్న అశీస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గోపా నాయకులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
