ప్రయాణికులకు గుడ్ న్యూస్
- రేపటినుంచి అందుబాటులోకి పుష్ పుల్
వాయిస్ ఆఫ్ భారత్ (లోకల్ న్యూస్): సాధారణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా రద్దయిన పుష్ పుల్ రైలు మంగళవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. రైలు నంబర్ 07753 ఖాజీపెట్ నుంచి డోర్నకల్, 07754 డోర్నకల్ టూ ఖాజీపెట్ ప్యాసింజర్, 07755 డోర్నకల్ టూ విజయవాడ , 07756 విజయవాడ టూ డోర్నకల్ ప్యాసింజర్, 07278 భద్రాచలం రోడ్ టూ విజయవాడ ప్యాసింజర్, 07979 విజయవాడ టు భద్రాచలం రోడ్ ప్యాసింజర్ రైళ్లను మంగళవారం నుంచి పున: ప్రారంభిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్, ప్రజా రవాణా కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్దాయి. అదనపు రైల్వే లైన్ పనులు, ఆధునీకరణ దృష్ట్యా పాక్షికంగా రద్దు చేసి, దారి మళ్లించిన పలు రైల్వే సర్వీసులను పునరుద్ధరించాలని రైల్వే ఉన్నతాధికారులను మానుకోట ఎంపీ కవిత పలు మార్లు కోరిన నేపథ్యంలో స్పందిన రైల్వే ఆధికారులు రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, గార్ల, డోర్నకల్ మీదుగా భద్రాచలం రోడ్డు తో పాటు భద్రాచలం రోడ్డు నుంచి డోర్నకల్ జంక్షన్ మీదుగా విజయవాడ వెళ్లే రైల్వే సర్వీసు ప్రారంభంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
