ప్రతి సమస్య పరిష్కరించి తీరుతా..
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వాయిస్ ఆఫ్ భారత్, కాజీపేట : ప్రజల మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, ప్రతి కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా తొడ్పాటు అందిస్తానని వరంగల్ పశ్చిమ నియోజవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం అధికారులతో కలిసి కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి పరిశీలించారు. చాలా ఏళ్లుగా నిర్మాణం జరిగిన బ్రిడ్జ్ మరమ్మత్తులకు కావాల్సిన ప్రణాళికలను అధికారులు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను కోరారు. మంజూరు చేసిన పనులపై కాంట్రాక్టర్లు అలసత్వం వహించడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కాజీపేటలో ఉన్న అన్ని డివిజన్లపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో బస్తీ బాట ద్వారా నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లు అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ విజయ్ శ్రీ, మాజీ కార్పొరేటర్లు అబుబకర్, సుంచు అశోక్, గుంటి కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకూస్, డివిజన్ అధ్యక్షులు అస్గర్, నాయకులు సీరిల్ లారెన్స్, మానస మధు, పసునూరి మనోహర్, ఇప్ప శ్రీకాంత్, పాలడుగుల ఆంజనేయులు, పోగుల సంతోష్, బుర్ర బాబు రావు,బిలాల్, విజయ్, శ్రీను, దువ్వ రాజు అధికారులు ఆర్డీఓ రమేష్ రాథోడ్, తహసీల్దార్ భావ్ సింగ్, ఆర్ అండ్ బీ ఈఈ సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
