ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
దామెర ఎస్సై అశోక్
వాయిస్ ఆఫ్ భారత్, దామెర : మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 30, 31, జనవరి 1 రాత్రి వేళలో మద్యం సేవించి వాహనాలు నడిపొద్దని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ చేసిన, రాత్రి పూట ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన, కాగితాలు లేకుండా బండి నడిపినా, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ముందస్తుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా డీజేలు పెట్టడం గానీ, రోడ్లపై కేక్ లు కట్ చేసి బాణాసంచా కాల్చడం, రోడ్డుపైన మద్యం సేవించడం చేస్తే చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చఏశారు. అందరూ తమ కుటుంబ సభ్యులతో క్షేమంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలని సూచించడంత పాటు ముందస్తుగా మండల ప్రజలకు ఎస్సై అశోక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
