ఇంటి యజమాని వేధింపులు/ Homeowner harassment

బాధిత కుటుంబంపై దాడి
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : ఒక అడ్వకేట్ పోలీసుల చేత అవమానానికి గురవుతున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హనుమకొండలోని టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉండే శ్రీరాముల శ్రావణ్ కుమార్ అనే న్యాయవాది ఓ పోలీస్ అధికారికి చెందిన ఇంటిని గత కొన్ని నెలలుగా అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే, ఆ ఇంటిని తక్షణమే ఖాళీ చేయాలని కొంతమంది పోలీసు సిబ్బంది తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అడ్వకేట్ శ్రావణ్ కుమార్ వాపోతూ చెప్పారు: “నేను ఇంట్లో లేని సమయంలో, నా భార్య, పిల్లలను భయభ్రాంతులకు గురిచేశారు. నా భార్య పైన దౌర్జన్యానికి దిగారు. బలవంతంగా వ్యక్తులను పంపించి ఇంట్లోని సామాన్లను బయటకు తీసేశారు. ఇది పూర్తిగా అక్రమం.” ఈ ఘటనపై పలుమార్లు సంబంధిత పోలీసు సుబేదారికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. “ఇబ్బందులు పెడుతున్నవారు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వారే కావడంతో, ఫిర్యాదులపై ఎవరూ చర్య తీసుకోవడంలేదు. న్యాయం కోసం పోలీసు కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగాలి,” అని ఆయన కోరారు.
