పశు వైద్య శిబిరం
వాయిస్ ఆప్ భారత్, దామెర : జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దామెర మండలం తక్కళ్లపాడు గ్రామంలో మంగళవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఊరుగొండ పశువైద్యాధికారి డాక్టర్.దీపిక రైతులను ఉద్దేశించి మాట్లాడుతు రైతులు తమ పాడి పశువులు ఎదకు వచ్చినప్పుడు గుర్తించి సకాలంలో కృత్రిమ గర్భధారణ గోపాల మిత్రుల ద్వారా చేపించాలని సూచించారు. ఈ శిబిరంలో 32పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణి చేయడం జరిగింది. ఈ శిబిరంలో వీఎల్వో లక్ష్మణ్, గోపాలమిత్ర సూపర్ వైజర్ ప్రకాష్ రెడ్డి, గోపాలమిత్రులు మధుకర్, సుమన్, గ్రామ పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
