పలు దేవాలయాల నుంచి అయోధ్యకు సహకారం

పలు దేవాలయాల నుంచి అయోధ్యకు సహకారం
  • మధుర, వారణాసి, ఉజ్జయినిల నుంచి ప్రసాదాలు
  • ఇప్పటికే తిరుమల లడ్డూ ప్రసాదం చేరిక

వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్): రాముడి ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో తిరుమల, ఉజ్జయిని, వారణాసి ఆలయాలు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల కోసం స్పెషల్‌ లడ్డులను సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం అయోధ్య నగర ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసిన ఒకటే మాటా.. ఒకటే బాటా. అందరి చూపు అయోధ్యలో కొలువుతీరబోతున్న ఆ రామయ్య విూదే ఉంది. ఈనెల 22న అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవానికి ఇప్పటికే అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. సోమవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల విూదుగా అర్చకులు, వేదపండితులు వైభవంగా నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం వెయ్యి కళ్లతో ఎదుచూస్తున్నారు. రామ్‌ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు లక్ష తిరుమల శ్రీవారి లడ్డులను పంపిస్తుంది. 25 గ్రాములతో కూడిన లక్ష లడ్డులను ప్యాక్‌ చేసింది. వీటిని ప్రత్యేక విమానంలో అయోధ్యకు పంపనుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్‌`1లో శ్రీవారి సేవకులు..ఒక్కో కవర్‌లో రెండు చిన్న లడ్డూలను ప్యాకింగ్‌ చేశారు.

ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు భక్తి శ్రద్దలతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మొత్తంగా దాదాపు 3 వేల కేజీల బరువు ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రేణిగుంట విమానాశ్రయం నుంచి అయోధ్యకు తరలించేందుకు పాలక మండలి సభ్యుడు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిర ప్రారంభం నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రకాల బహుమతులు రామయ్య చెంతకు చేరుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌ నుంచి 5 లక్షల లడ్డూలు వెళ్లాయి. సుమారు 5 ట్రక్కుల లడ్డుల వెహికల్స్‌ను రాష్ట్ర సీఎం మోహన్‌ యాదవ్‌ జెండా ఊపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహాకాలేశ్వర్‌లో 5 రోజులు శ్రమించి ఈ లడ్డూలను తయారు చేశారు. మరోవైపు మధురలోని శ్రీ కృష్ణ జన్మస్థాన్‌ సేవా సంస్థాన్‌ కూడా 200 కిలోల లడ్డూలను నైవేద్యంగా పంపుతుంది. ఇదిలా ఉంటే .. వారణాసి లార్డ్‌ విశ్వనాథ్‌ అండ్‌ మహాకాల్‌ కోర్టుల నుండి లడ్డూల పంపిణీకి పూనుకుంది. కాశీ విశ్వనాథ ఆలయం 3 లక్షల లడ్డూలను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంది. కాశీ విశ్వనాథ ఆలయం ద్వారా మొత్తం 3 లక్షల లడ్డూలను పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. అయోధ్యలో రామ్‌ లల్లా పవిత్రోత్సవం.. విశ్వనాథ భగవానుడి భోగ్‌ ఆరతితో పాటు మధ్యాహ్నం 12:30 గంటలకు షెడ్యూల్‌ చేయబడిరది. ఆరతి, లడ్డూల పంపిణీ ప్రారంభమై రాత్రంతా కొనసాగుతుందని.. కాశీ దేవాలయాల ద్వారా కూడా మహకాల్‌ లడ్డూలను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. దాదాపు 100 దేవాలయాలు ఒక్కొక్కటి 1,100 లడ్డూలను పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *