నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు
ఒకరి మృతి, మరొకరికి గాయాలు
వాయిస్ ఆఫ్ భారత్, రఘునాథపల్లి : హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి మరొకసారి రక్తమోడింది. గత 15 రోజుల్లో 5కుపైగా రోడ్డు ప్రమాదాలు సంభవించిన ఈ మార్గంలో తాజాగా మరో దుర్ఘటన చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం రఘునాథపల్లి మండలంలోని గోవర్థనగిరి గ్రామ బస్టాండ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న చెల్లెలు విజయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె అన్న లింగస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్ గ్రామానికి చెందినవారు కాగా, గాయపడ్డ లింగస్వామి కొమ్మల్ల గ్రామానికి చెందినవాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనగామ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నరేష్ యాదవ్ ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం మరోసారి జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో రుజువు చేసింది.
ఈ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

