నా సినిమా చూండండి

నా సినిమా చూండండి
  • ఏడుస్తూ వేడుకున్న సోహెల్‌

వాయిస్ ఆఫ్ భారత్ (సినిమా):బిగ్‌ బాస్‌ ఇంట్లోకి వచ్చి బాగా పాపులర్‌ అయిన సోహెల్‌ సినిమా ’బూట్‌ కట్‌ బాలరాజు’ విడుదలైంది, ఈ సినిమాతో అతను నిర్మాతగా కూడా మారాడు. శ్రీనివాస్‌ కోనేటి ఈ సినిమాకి దర్శకుడు, ఇందులో మేఘలేఖ కథానాయకురాలు, ఇంకో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సిరి హనుమంత్‌ కూడా ఇంకో కథానాయికగా కనపడుతుంది. కమెడియన్‌ సునీల్‌ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనపడగా, ఇంద్రజ ఇంకో ముఖ్యపాత్రలో కనపడిరది. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. అయితే ఈ సినిమాకి అటు విమర్శకుల నుండి గానీ, ఇటు ప్రేక్షకుల నుండి గానీ అంత స్పందన లభించలేదు.

ఒక మల్టిప్లెక్స్‌ లో ఈ సినిమా చూడటానికి సోహెల్‌ వచ్చాడు. సినిమా అయ్యాక బయటకి వచ్చి కళ్ళనీరు పెట్టుకొని తన సినిమా చూడమని అందరికీ విజ్ఞప్తి చేసాడు. ’బిగ్‌ బాస్‌ లో వున్నప్పుడు వేలకొద్దీ కామెంట్స్‌ సోహెల్‌, సోహెల్‌ అంటూ పెట్టారు కదన్నా. ఇప్పుడేమైంది అన్నా, అందరూ వెళ్లండన్నా నా సినిమాకి, చూడండి అన్నా నా సినిమాని,’ అని వేడుకుంటూ కళ్లనీళ్లు పర్యంతం అయ్యాడు. పక్కనే వున్న అవినాష్‌ సోహెల్‌ ని ఊరడిస్తూ కనిపించాడు. ఒక మంచి సినిమా తాను తీసాను అని, కుటుంబ సభ్యులు అందరితో చూసే విధంగా తన ’బూట్‌ కట్‌ బాలరాజు’ సినిమా ఉంటుందని, అందుకే అందరూ వెళ్లి చూడాలి అని వేడుకున్నాడు. ’ముద్దు పెª`టటె సీన్స్‌ చేసి చూపించాలా,’ అని వాపోయాడు. తాను అలంటి సినిమా చెయ్యలేదని, చెల్లితోటి, అక్కతోటి, తమ్ముడు, చిన్నపిల్లలతో చూసే సినిమా చేశాను అని, అలాగే ఈ సినిమాకి ఉన్నదాంట్లో ఎంత చెయ్యాలో అంత చేసాను అని చెప్పుకొచ్చాడు. కంటెంట్‌ వున్న సినిమాని ఎలాగు ఎంకరేజ్‌ చేస్తారు, అలాగే తన సినిమాని కూడా చూడాలని చెప్పుకొచ్చాడు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అందరూ థియేటర్‌ కి వెళ్లి తన సినిమా చూడాలని ఏడుస్తూ విజ్ఞప్తి చేసాడు. పక్కన వున్న అవినాష్‌ శనివారం, ఆదివారం వీకెండ్‌ వస్తోంది, అందరూ చూస్తారు నీ సినిమాని అని సోహెల్‌ ని సముదాయించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *