‘నానో ఎరువులు రైతులకు లాభదాయకం’/ ‘Nano fertilizers are beneficial for farmers’
ఇఫ్కో ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : వ్యవసాయంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్న నానో ఎరువులు రైతులకు లాభదాయకమని నిపుణులు పేర్కొన్నారు. వరంగల్లోని ఓ ప్రైవేట్ దాబాలో ఇఫ్కో (IFFCO) ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఈ అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నానో యూరియా, డీఏపీ, కాపర్, జింక్ వంటి నానో ఎరువుల గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్.ఎ.ఆర్.ఎస్, ఏ.డీ.ఆర్ డా. రావుల ఉమారెడ్డి, డీ.ఏ.ఓ అనురాధ, ఇఫ్కో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్ మాట్లాడుతూ నానో సాంకేతికతతో తయారుచేసిన నానో యూరియా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, అధిక దిగుబడిని ఇస్తుందని తెలిపారు. ప్రతి రైతు నానో ఎరువులను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని వారు కోరారు.
