దుర్గాష్టమి ( సద్దుల బతుకమ్మ పండుగ) సోమవారమా ? మంగళవారమా ?
వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్ న్యూస్) : దుర్గాష్టమి (సద్దుల బతుకమ్మ పండుగ) సోమవారమా ? మంగళవారమా ? ఈ మద్యకాలంలో పండుగలు వచ్చిన ప్రతీసారి ఇదో పెద్ద సమస్యగా మారింది. ఒకరు ఒకరోజంటే.. మరొకరు ఇంకోరోజు అంటూ.. అ రోజు అలావుంది. అలా ఎలా చేస్తారు. ఇలా ఎలా చేస్తారు. అంటూ వాదిస్తున్నారు. ఈ వాదనలు వివాదాలు ఈ మధ్య ఎక్కువ అయ్యాయి. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి అందరూ పండితులే అయ్యారు. మరి దుర్గాష్టమి గురించి కాసేపు పక్కన పెడితే. అలసు తిథులను ఎలా లెక్కిస్తారు ముందుగా తెలుసుకుందాం. మనకు పాడ్యమి నుండి పౌర్ణమి, అమావాస్యవరకు తిథులను చూసుకున్నట్లయితే.. ఒక రోజులో తిథి అటుఇటుగా మారుతూవుంటాయి. ఒక సారి తిథులు తొందరగా వచ్చి పోతుంటాయి. లేదా ఎక్కవు గా ఉంటాయి. ఒక సారి తిథులు రెండు రోజులలో కలిపి ఉంటాయి. ఇలా రావడం వల్లే సమస్యగా మారుతుంది. దుర్గాష్టమి తిథి ప్రధానం కాబట్టి తిథి ప్రకారమే ఎందుకు చేయాలో తెలుసుకుందాం..
బతుమ్మ నిమజ్జనం అంతర్యం :
అసలు బతుకమ్మ నిమజ్జనం ఎందుకు చేస్తారు. మనము గణపతి నవరాత్రలలో కాని, దుర్గాష్టమి నవరాత్రలలో కాని తొమ్మిది రోజు పూజించిన తరువుతా తొమ్మిదోరోజు నిమజ్జనం చేస్తూ ఉంటాము. ఇలా ఎందుకు చేస్తామంటే. మన దైనందన జీవితంలో ప్రతి రోజు దేవుళ్లకు పెద్ద ఎత్తున్న పూజలు చేయలేము. ప్రతి రోజు దూపదీప నైవేద్యాలు పెట్టలేము. అందువల్ల తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు భక్తితో ఘనంగా పూజచేసి ఇక తొమ్మిరోజలు పదకొండు రోజులకంటే ఇక మేము చేయలేమని ఆ దైవానికి విన్నవించుకొని మళ్ళీ వచ్చే ఏడాది రమ్మని చెప్పి నీటిలో నిమజ్జనం చేస్తాము. ఇలా చేయడం ఒక విషయమైతే… మన పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రకృతిలో లభించే ప్రతీది అంటే వినాయ చవితిలో గణపతికి సమర్పించే 21 రకాల పత్రులు వైద్య మూళికలే.. అలాగే బతుకమ్మ పండుగలో వివిధ రకాల పూలతో పేర్చే బతుమ్మ కూడా ప్రకృతి ప్రసాదించిన పుష్పాలే.. ఇలా ప్రకృతి నుండి లభించే పత్రాలు, పుష్పాలు నీటిలో కలపడం వల్ల వాటిలో ఉన్న ఔషదాలు నీటిలో చేరి మన దగ్గర ఉన్న చెరువులు, కుంటలలో ఉన్న మాలిన్యాలు నశించి నీరు శుభ్రపడుతుంది. అందేకే అలా చేస్తాము. ఇది నిమజ్జనం వెనుక ఉన్న అంతర్యం. బతుమ్మ పండుగలో మహిళలు తయారు చేసిన బతుకమ్మ పూలతో చేసిందే కాబట్టి మనం ఆ బతుకమ్మకు పూజ చేసాం కనుక పవిత్రంగా భావించి దానిని బయట ఎక్కడ పడితే అక్కడ పారేయలేము కనుక నీటిలో నిమజ్జనం చేస్తాము. దేవతలకు పూజానంతరం ఉద్వాసన చెపుతాం. పూజలో ఉద్వాసన చెప్పినపుడు ఆ దేవతా శక్తి ఆ విగ్రహం లేదా ప్రతిమ నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడి విగ్రహం లేదా ప్రతిమను నిమజ్జనం చేయడం దేవతను సాగనంపడంగా భావించకూడదు. కేవలం పూజలో ఉపయోగించిన సామాగ్రి, ప్రతిమ లేదా విగ్రహాలను మాత్రమే నీటిలో కలుపుతున్నామని భావించాలి.
మంగళవారం గౌరమ్మను మా ఇంటి నుండి ఎలా పంపుతాం:
అయితే మంగళవారం గౌరమ్మను పంపితే అలిగి మా ఇంటి నుండి వెళ్ళిపోతుందేమోనని ప్రతి మహిళకు సందేహం వస్తుంది. అయితే బతుకమ్మను పేర్చినపుడు పసుపు గౌరమ్మను చేసి పూలబతుకమ్మపై పెడుతారు. ఆ రోజు బతుమ్మను గంగమ్మ వడికిచేర్చేటపుడు కొంతమంది పూల బతుకమ్మనుండి పసుపు గౌరమ్మను వేరుచేసి ఇంటికి తెచ్చుకుంటారు. కొంతమంది పసుపు గౌరమ్మను అక్కడే నీటి కలుపుతారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. ఇక్కడ గమనించచ వలసిన విషయం ఏమిటంటే మనం గౌరమ్మగా భావించే బతుకమ్మ పూలతో చేసిందే కాబట్టి పూలను మాత్రమే నీటిలో వదిలి. పసుపుతో చేసిన గౌరమ్మను ఇంటికి తెచ్చుకొని ఇంటిలోనే నీటిలో కలుపుకోవడం ఉత్తమం. ఆ పసుపు మహిళలు తమ మంగళసూత్రానికి అద్దుకొని మిగిళన నీటిని తులిసి కోటలోనో.. చెట్లకు పోయడం ఉత్తమం.
మంగళవారమే బతుమ్మ ఎందుకు :
అయితే మనకు శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఏ తిథిని అయినా సూర్యోదయానికి మాత్రమే చూసుకోవాలని, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథినే ఆరోజు తిథిగా భావించాలని శాస్త్రం చెపుతుంది. ఒక్క పౌర్ణమి, అమావాస్య తిథులు మాత్రం సూర్యాస్తమయం తరువాత అంటే రాత్రికి చూసుకోవాలని శాస్త్రం, పండితులు చెపుతుంటారు. వాస్తవానికి అదే సరైనది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే అష్టమి తిథి సోమావారం సాయంత్రం 04.31 గంటలకు ప్రారంభమైనప్పటికి మంగళవారం సూర్యోదయానికి ఉండి మంగళవారం సాయంత్రం 06.06 గంటల వరకు పూర్తవుతంది. కాబట్టి దుర్గాష్టమి మంగళవారం జరుపుకోవడమే ఉత్తమం.
కొసమెరుపు : బతుకమ్మ పండుగ అంటేనే అంకరణ ప్రాధాన్యంతో ఉంటుంది. బతుకమ్మను ఎంత అందంగా అంకరించి పేర్చుతారో.. అంతకంటే అందంగా తయారై బతుమ్మను సాగనంపడానికి వెళ్తారు మహిళలు. బతుకమ్మను తయారు చేసిన సమయానికంటే మహిళలు తయారు కావడానికే అధిక సమయం పడుతుంది. కాబట్టి సమయానికి కూడా విలువ ఉంటుంది కాబట్టి నవమి తిథి బుధవారం ఉన్నప్పటికీ మంగళవారం సాయంత్రం 06.06 గంటలకు ప్రవేశిస్తుంది కాబట్టి అష్టమి తిథి వెళ్ళే లోపే నిమజ్జనం చేయడం శ్రేయస్కరం.
