డీఆర్డీఓను కలిసిన ఆదర్శ రైతు
డ్రాగన్ ఫ్రూట్ల అందజేత
వాయిస్ ఆఫ్ భారత్, దామెర : హనుమకొండ డీఆర్డీఓ మేన శ్రీనును ఉత్తమ ఆదర్శ రైతు దామర మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ఎండీ రంజాన్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పండిస్తున్న డ్రాగన్ ఫ్రూట్లను డీఆర్డీఓకు అందించారు. ఈ సందర్భంగా డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ఉపాధి హామీ అధికారుల సహకారం, సాగు ఖర్చు, తదితర అంశాలపై ఆదర్శ రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మేన శ్రీను మాట్లాడుతూ జాతీయ ఉపాధి పథకంలో అనేక ఉద్యానవన పంటల సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని, ప్రతి రైతు ఉపయోగించుకోవాలన్నారు. దీంతో పాటు రైతులకు ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఏపీఓ శారదలను అభినందిస్తూ రైతు రంజాన్ కు ఉపాధి హామీ పథకం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన ఆదేశించారు. వీరి వెంట అదనపు పీడీ తదితర అధికారులు ఉన్నారు.
