టీఆర్ పీఎస్ రాష్ట్ర ప్రతినిధిగా నామాల సత్యనారాయణ

టీఆర్ పీఎస్ రాష్ట్ర ప్రతినిధిగా నామాల సత్యనారాయణ
TRPS STATE REPRESENT@ NAMAMLA SATYAM

వాయిస్ ఆఫ్ భారత్, నర్సంపేట : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రతినిధిగా నర్సంపేట మండలం రాజపల్లెకు చెందిన నామాల సత్యనారాయణను టీఆర్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ నియమించారు. ఈ సందర్భంగా సోమవారం నామాల సత్యనారాయణను కుల బంధవులు దేవులపల్లి నరేందర్, దేవులపల్లి గణేష్, నామాల నరేష్, దేవులపల్లి రాజేందర్, వేముల పవన్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నామాల సత్యనారాయణ పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే మరిన్ని పదవులు పొందాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *