జాతీయ మానవ హక్కుల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా కోడెం రమేష్

వాయిస్ ఆఫ్ భారత్, కమలాపూర్ : జాతీయ మానవ హక్కుల తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెంనకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కోడం రమేష్ ను నియమించినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె ఎస్ జ్యోతిశ్వర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మానవ హక్కుల కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పదవిని అప్పగించినట్లు జ్యోతిశ్వర్ రెడ్డి తెలిపారు. రమేష్ సీనియర్ జర్నలిస్టుగా గత 15 ఏళ్లుగా సామాజిక, రాజకీయంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం విశేష కృషి చేస్తున్నారు. అలాగే మాలల చైతన్యం కోసం విస్త్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో మానవ హక్కుల సంఘం వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడీగా కూడా పనిచేశారు. ఈ ఎన్నిక పట్ల మాలల సంఘం జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ, తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్, మాజీ ఎంపీ హర్షకుమార్, మ్యాకమల్ల రత్నం, తుపాకుల ఐలయ్య కోడెం రమేష్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తనను జాతీయ మానవ హక్కుల తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు ఆ సంఘం జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె ఎస్ జ్యోతిశ్వర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




