ఘనంగా కీర్తి హాస్పిటల్ ప్రారంభోత్సవం
హాజరైన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయిని
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : కీర్తి హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లకు మానవత దృక్పథంతో నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం నయీంనగర్ లో డాక్టర్ ముక్క దిలీప్ కుమార్ అర్చన దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తి ఉమెన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అనే విధంగా వైద్యులు భగవంతుడి మాదిరిగా వైద్య సేవలు అందించి హాస్పటల్ లో జన్మించే శిశువులు భవిష్యత్తులో బలంగా ఉండే విధంగా వైద్యం అందించాలని సూచించారు. డాక్టర్ ముక్క దిలీప్ కుమార్-అర్చన దంపతులను వారు అభినందించారు. ఈ కార్యక్రమం లో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
