గ్రావిటీ విద్యార్థుల విజయఢంకా
ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ
హనుమకొండ, వాయిస్ ఆఫ్ భారత్ : రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిన్న విడుదల చేసిన ఫలితాల్లో గ్రావిటీ జూనియర్ కాలేజ్, హనుమకొండ విద్యార్థులు విజయడంక మోగించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విజయాలు కళాశాల స్థాయిలో ప్రశంసలందుకున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో మొత్తం 470 మార్కుల్లో, కె. అభినాష్ 467 మార్కులు సాధించగా, కె. అమూల్య, డి. రోహిణి, జి. చైతన్యలూ తలసరిగా 466 మార్కులు పొందారు. అలాగే 460కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 30కి చేరింది. బైపీసీ విభాగంలో 440 మార్కుల్లో కె. శ్రవ్య 436 మార్కులు సాధించగా, ఆర్. వైష్ణవి, ఈ. భార్గవ సాయి లు 430 మార్కులకిపైగా పొందారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగం: 1000 మార్కుల్లో ఓ. కీర్తన 995 మార్కులు, సీహెచ్. సౌమ్యశ్రీ 992 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో జి.రాజేష్ నాయక్ 992 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించాడు. ఈ ఘనత సందర్భంగా కళాశాల చైర్మన్ మహేష్, ప్రిన్సిపాల్ నరసింహారావు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సందీప్, అమరేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్, వంశీకృష్ణతో పాటు అధ్యాపకులు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
