గ్రామీణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు
అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మె
బయ్యారం మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో మానవ హరం,
గ్రామీణ బందులో పాల్గొన్న బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
Voice of Bharath (Local News) : ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించి, బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు అనేక సమస్యల పై పోరాటం చేస్తున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్మిక హక్కులను కాలరాస్తు,వారి సంక్షేమానికి ఏ మాత్రం ఉపయోగపడక వారిని శ్రమను నిలువునా దోపిడీ చేస్తుందని విమర్శించారు.భారత్ న్యాయ సంహిత, హిట్ & రన్ సెక్షన్ 106(1)(2)లని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి మోటర్ వాహన చట్టం 2019ని సవరించాలని డిమాండ్ చేశారు.అలాగే కార్మికుల పిల్లలకి స్కాలర్షిప్ లు,ఇల్లు ఇళ్ల స్థలాలు,ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేయకుండా చట్టాలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు.పెరుగుతున్న నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలని,ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, హమాలీ,కార్మికులు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమం లో అఖిలపక్షం పార్టీల రైతు కూలి సంగం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కొత్తపేటలో….
అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మె మద్దతు ప్రకటించి కొత్తపేట బస్టాండ్ సెంటర్ లో ,
గ్రామీణ బందులో పాల్గొన్న కాంగ్రెస్ యువజన నాయకులు భూక్య ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ…కార్మికులు అనేక సమస్యల పై పోరాటం చేస్తున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్మిక హక్కులను కాలరాస్తు,వారి సంక్షేమానికి ఏ మాత్రం ఉపయోగపడక వారిని శ్రమను నిలువునా దోపిడీ చేస్తుందని విమర్శించారు.భారత్ న్యాయ సంహిత, హిట్ & రన్ సెక్షన్ 106(1)(2)లని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి మోటర్ వాహన చట్టం 2019ని సవరించాలని డిమాండ్ చేశారు.
