గుప్త నిధుల తవ్వకాల నిందితుల అరెస్ట్
వాయిస్ ఆఫ్ భారత్, దామెర : గత నెలలో వరంగ్దాల జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండల పరిధిలోని పులుకుర్తి గ్రామ శివారులో చంద్రగిరి గుట్ట మీద ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపగా దామెర రెవెన్యూ ఇన్ స్పెక్టర్ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు దామెర ఎస్సై కొంక.అశోక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. ఈ కేసులో నేరస్థులుగా బైరాన్ పల్లికి చెందిన భూక్య శ్రీను, ఎనుమాములకు చెందిన గొలుసుల నరేష్, వరంగల్ లక్ష్మి పూర్ కు చెందిన కె.భరత్ కుమార్, వరంగల్ రంగశాయిపేటకు చెందిన లింగంపల్లి నాగరాజు, అశోక్ నగర్ పాకాలకు చెందిన బొంత రమేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మరో ఇద్దరు నేరస్తులు పరారీలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ పరకాల ఈ.కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇలా ఎవరైనా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాకచక్యంగా నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేసిన దామెర ఎస్సై కొంక అశోక్, వారి సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
