క్లారిటీ వచ్చేసింది.. ఇక యుద్ధమే..
వరంగల్ మున్సిపల్ పోరుకు సన్నద్ధం
ఖరారైన 13 మున్సిపాలిటీల జాబితా
గ్రేటర్ వరంగల్ ‘జనరల్’..
ఆశావాహుల్లో పెరిగిన జోష్
మహిళలకు పెద్దపీట
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల వేడి ఒక్కసారిగా పతాక స్థాయికి చేరింది. ఇన్నాళ్లూ రిజర్వేషన్ల లెక్కలపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, ప్రభుత్వం 13 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ వీడి, అసలు సిసలు ఎన్నికల సమరానికి వేదిక సిద్ధమైంది. ఈ ప్రకటనతో జిల్లాలోని ప్రధాన పార్టీల వ్యూహాలు, సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ‘గ్రేటర్’ వైపు!అందరి కళ్లు ఉన్న గ్రేటర్ వరంగల్ (GWMC) మేయర్ స్థానం ఈసారి ‘జనరల్’ కేటగిరీకి దక్కింది. దీంతో జిల్లాలోని హేమాహేమీ నేతలు మేయర్ పీఠంపై కన్నేశారు. జనరల్ స్థానం కావడంతో కుల, మత సమీకరణాలకు అతీతంగా గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఫలితంగా ఇక్కడ పోటీ తీవ్రస్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.మహిళలకు అగ్రతాంబూలంఈసారి మున్సిపల్ రిజర్వేషన్లలో మహిళా శక్తికి పెద్దపీట వేశారు. 13 మున్సిపాలిటీల్లో 5 స్థానాలను మహిళలకే కేటాయించడం విశేషం.
వాయిస్ ఆఫ్ భారత్, వరంగల్ :
మహిళలకు పెద్ద పీట : మహబూబాబాద్:ఎస్టీ (మహిళ), కేసముద్రం: ఎస్సీ (మహిళ), మరిపెడ: జనరల్ (మహిళ), నర్సంపేట: బీసీ (మహిళ), ములుగు: బీసీ (మహిళ)లకు కేటాయించారు.
రిజర్వేషన్ల వారీగా వివరాలు : గ్రేటర్ వరంగల్ జనరల్-2,మహబూబాబాద్ -ఎస్టీ (మహిళ), కేసముద్రం-ఎస్సీ (మహిళ), మరిపెడ -జనరల్ (మహిళ),నర్సంపేట-బీసీ (మహిళ), ములుగు-బీసీ (మహిళ), తొర్రూరు-జనరల్, పరకాల-జనరల్,వర్ధన్నపేట-జనరల్, డొర్నకల్-ఎస్సీ (జనరల్),స్టేషన్ ఘన్పూర్-ఎస్సీ (జనరల్),భూపాలపల్లి-బీసీ (జనరల్), జనగామ-బీసీ (జనరల్)లుగా ప్రభుత్వం ఖరారు చేసింది.
గ్రౌండ్ వర్క్ షురూ..
రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహుల్లో జోష్ పెరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు కేటాయించిన స్థానాల్లో ఆయా సామాజిక వర్గాల నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే తమ అధిష్టానాల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. టికెట్ వేటలో వెనుకబడకుండా తమ అనుచర వర్గంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.రాజకీయ చదరంగం ప్రారంభంరిజర్వేషన్ల లెక్కలు తేలడంతో ఇప్పుడు పార్టీల దృష్టి అభ్యర్థుల ఎంపికపై పడింది. ముఖ్యంగా జనరల్ స్థానాల్లో సామాజిక సమీకరణాలు, బీసీ, ఎస్సీ స్థానాల్లో పట్టు ఉన్న నేతల కోసం అన్వేషణ మొదలైంది. ఏదేమైనా, ఈ రిజర్వేషన్ల ప్రకటన ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ పోరును రసవత్తరంగా మార్చేసింది.
