కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఊర్వశి రౌతేలా/Urvashi Rautela on the Cannes red carpet
డిజైనర్ ఫ్యాషన్‌తో మెరుపులు
వాయిస్ ఆఫ్ భారత్, సినిమా : 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 మే 13న అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది లాగే, ఈ సారి కూడా బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తన స్టన్నింగ్ లుక్స్‌తో రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది. ధైర్యవంతమైన ఫ్యాషన్ ఎంపికలతో తరచూ వార్తల్లో నిలిచే ఈ నటి, ఈ సారి రకరకాల రంగుల్లో మెరిసే ఫిష్‌టెయిల్ గౌనుతో హైలైట్‌గా నిలిచింది. ఈ స్ట్రాప్‌లెస్ గౌనులో రెడ్, బ్లూ, యెల్లో కలర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గౌన్‌కు చేర్చిన పొడవాటి ట్రెయిల్ ఆమె లుక్కు మరింత డ్రామాటిక్ టచ్‌ను తీసుకువచ్చింది. మ్యాచింగ్ కిరీటం, హేవీ చెవిపోగులు, బోల్డ్ ఐ మేకప్ ఆమె స్టైల్‌ను మరింత ఎలివేట్ చేశాయి. అయితే అందరి దృష్టిని మించి ఆకర్షించినది ఆమె చేతిలో ఉన్న స్పెషల్ క్లచ్ బ్యాగ్. చిలుక ఆకారంలో ఉన్న ఈ క్లచ్, పూర్తి క్రిస్టల్స్‌తో తయారుచేయబడింది. ఈ విలాసవంతమైన ప్యారట్ క్లచ్‌ను ఫేమస్ డిజైనర్ జుడిత్ లీబర్ రూపొందించారు. దీని ధర సుమారు $5,495 (భారత కరెన్సీలో సుమారు రూ. 4.68 లక్షలు). క్లచ్ ప్రత్యేకత వలన ఫ్యాషన్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
ఫోటోగ్రాఫర్లకు స్టన్నింగ్ పోజులు ఇస్తూ, ఆ క్లచ్‌కి ముద్దుపెట్టుతూ ఊర్వశి రెడ్ కార్పెట్‌పై మరింత హడావుడి చేసింది. ఈ లుక్‌పై మిక్స్డ్ రెస్పాన్స్‌లు వచ్చాయి – కొంతమంది నెటిజన్లు ఆమె లుక్కు ఫిదా అయితే, మరికొందరు సరదాగా ట్రోల్స్‌తో స్పందించారు. “తెల్లవారుజామున 3 గంటలకు పోస్ట్ చేసిన తొలి భారతీయ నటి”, “విదేశంలో కారు దిగిన తొలి భారతీయ మహిళ” వంటి సెటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఈ వీడియోను ఊర్వశి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో షేర్ చేయగానే ఫ్యాన్స్ నుండి కామెంట్ల వర్షం కురిసింది. ప్యారట్ క్లచ్‌ను గర్వంగా పట్టుకుని లగ్జరీ కార్ నుండి దిగుతూ, రెడ్ కార్పెట్‌పై నడిచే దృశ్యం ఫ్యాషన్ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఊర్వశి రౌతేలా గతంలో కూడా అనేకసార్లు కేన్స్ ఫెస్టివల్‌కి హాజరయ్యారు. ప్రతిసారీ ఆమె వైవిధ్యమైన ఫ్యాషన్ ఎంపికలు ట్రెండింగ్‌గా మారడం విశేషం. పొగడ్తలు వచ్చినా, ట్రోల్స్ వచ్చినా… ఈ బ్యూటీ మాత్రం ఫ్యాషన్ గేమ్‌లో ఎప్పుడూ ముందే ఉంటుంది.
