కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా

కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా
  • వైసీపీకి బిగ్‌ షాక్‌
  • కాపు రామచంద్రారెడ్డికి టిక్కెట్‌ నిరాకరణ
  • నమ్మించి గొంతు కోశారన్న కాపు
  • భార్యాభర్తలం ఇద్దరం పోటీ చేస్తామని ప్రకటన

(వాయిస్ ఆఫ్ భారత్, అమరావతి)  వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్‌, సీఎం జగన్‌ కు పంపించారు. అనంతరం విూడియాతో మాట్లాడిన రామచంద్రారెడ్డి.. సీఎం జగన్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్‌ను నమ్ముకుని కాంగ్రెస్‌ నుంచి వచ్చానన్న రామచంద్రారెడ్డి… తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. జగన్‌ చెప్పిన ప్రతి పని చేశామని ఇప్పుడు… సర్వేపేరు చెప్పి టికెట్‌ ఇవ్వలేమనడం బాధగా ఉందని కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కనీసం జగన్‌ తనకు అపాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాపు రామచంద్రారెడ్డి 2009లో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు.

2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఇక 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి 14 వేల 49 ఓట్ల మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్వే పేరు చెప్పి తన గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం, కళ్యాణ దుర్గం నుంచి రెండు చోట్ల తాను, తన భార్య పోటీ చేస్తామని స్పష్టం చేశారు.’రాయదుర్గం నుంచి నా భార్య తప్పని సరిగా పోటీ చేస్తారు. సీఎంను కలిసి మాట్లాడడం మాకు కుదరలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసే అవకాశం రాలేదు. ఇంత కన్నా అవమానం మాకు ఎప్పుడు జరగలేదు. నమ్మించి తెచ్చి మా గొంతు కోశారు. ఇకనైనా సొంత నిర్ణయంతో స్వతంత్రంగా లేదా అవకాశం కల్పించిన ఏ పార్టీ అయినా పోటీకి సిద్దం. నేటికీ ఒక్కసారి కూడా వేరే పార్టీతో మాట్లాడలేదు. మా ఇంటి నిండా లైట్‌ లు వేస్తే జగన్‌ ఫోటో లే కనబడతాయి. వైసీపీ పెట్టినప్పుడు ఐదేళ్లు పదవీకాలం వదులుకొని వచ్చాను. 2014, 19లో పోటీ చేయను అన్నా మంత్రి పదవి ఇస్తాను అని పోటీ చేయించారు. రాత్రి, పగలు గడప గడపకు తిరిగాను అయిన సర్వే పేరుతో టికెట్‌ నిరాకరించారు. మా జీవితాలు సర్వనాశనం అయ్యాయి. ఈ రోజు వరకు జగన్‌ మా దేవుడు అనుకున్నాం. జగన్‌ మా గొంతు కొస్తాడనుకోలేదు. స్వతంత్రంగా గెలిచే సత్తా కూడా మాకు ఉంది’ అని కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *