కమలాపూర్ సీహెచ్ సీలో వైద్యుల నిర్లక్ష్యం
బాలింతకు సీరియస్
ఆందోళనకు దిగిన బంధువులు
విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ అప్పయ్య
వాయిస్ ఆఫ్ భారత్, కమలాపూర్ : మండల కేంద్రంలోని సీహెచ్ సీలో వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. గత వారం ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు డెలివరి సమయంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆ సమయంలో వైద్యలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సదరు మహిళకు తీవ్రమై నొప్పి వచ్చిందని ఆదివారం సీహెచ్ సీ లో బంధువులు ఆందోళనకు దిగారు. అయితే వివరాల్లోకి వెళితే వారం రోజలు క్రితం ఓ మహిళ డెలివరి కోసం హస్పిటల్ లో చేరగా 3.5 కేజీ బేబీ డెలివరీ కోసం సర్జరీ చేయాల్సి వచ్చింది. సున్నితమైన ప్రదేశం కాబట్టి, నరాలు చిట్లి బ్లీడింగ్ ఎక్కువగా జరగడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో వారు కడుపులోనే కాటన్ పెట్టి కుట్లు వేసి మరిచారు. ఆ కాటన్ ను మళ్లీ తీయాల్సి ఉండగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మహిళ ప్రాణాల మీదికొచ్చింది. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం జరిగిన ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారులు అప్పయ్య, గౌతమ్ చౌహాన్ విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా మీడియాతో డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు పేషంట్ బంధువుల అభిప్రాయం తెలుసుకున్నామని, నివేదిక కలెక్టర్ కు సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


