ఓ బొజ్జ గణపయ్య.. ఆరగించగ రావయ్య..

ఓ బొజ్జ గణపయ్య.. ఆరగించగ రావయ్య..
  • సత్యం సంస్థలో 108 రకాల నైవేద్యాలు

వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్ న్యూస్): నగరంలోని ప్రముఖ సత్యం కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ సంస్థలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం గణనాథునికి 108 రకాల ఫల, పిండి పదార్థాలతో నైవేద్యాలు సమర్పించారు. సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థల అధినేత, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయన్నారు. గత 23 సంవత్సరాలుగా తమ సంస్థలో నవరాత్రి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలంతా స్వామివారి కృపతో సుఖ సంతోషాలతో ఉండాలని రవికుమార్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *