ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే పీఆర్టీయూ లక్ష్యం
- సంఘ ఆవిర్భావ దినోత్సవం లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాయత్రి రోగులకు పండ్లు పంపిణీ
వాయిస్ ఆఫ్ భారత్ (లోకల్ న్యూస్): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే పి ఆర్ టి యు లక్ష్యం అని పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు యద్దనపూడి గాయత్రి, మండల అధ్యక్షుడు రవి అన్నారు పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బయ్యారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పిఆర్టియు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగట శ్యామల యాదగిరి జన్మదినాన్ని పిఆర్టియు ఆవిర్భావ దినోత్సవం గా జరుపుకుంటున్నట్లు వారు తెలిపారు. సంఘ ఆవిర్భావ నుంచి నేటి వరకు ఉపాధ్యాయ సమస్యల పట్ల పి ఆర్ టి యు నిరంతరం కృషి చేస్తున్నది, రాష్ట్రంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం అయిన పిఆర్టియు సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల ప్రధాన కార్యదర్శి మోహన్, బి పల్లవి బి అరుణాదేవి, బి ధనమ్మ సుధాకర్, కవిత తదితరులు పాల్గొన్నారు
