ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన
దేశరాజ్ పల్లిని సందర్శించిన కలెక్టర్ ప్రావీణ్య
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : కమలాపూర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన దేశరాజ్ పల్లి గ్రామాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆమె దగ్గరుండి పరిశీలించారు. అనంతరం లబ్దిదారులను నిర్మాణానికి సంబంధించిన ఇసుక, సిమెంట్, ఐరన్, ఇటుక లభ్యతపై ఆరా తీశారు. బేస్ మెంట్ లెవల్ నిర్మాణం పూర్తైన లబ్ధిదారులకు మొదటి విడత డబ్బులు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రాని వారికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డీఈ సిద్ధార్ద నాయక్, ఎంపీడీఓ గుండె బాబు, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, కమలాపూర్ ఏఎంసీ చైర్ పర్సన్ తౌటం ఝాన్సీరాణి-రవీందర్, ఏఎంసీ వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య, ఏఎంసీ డైరెక్టర్ సముద్రాల క్రిష్ట, ఇజ్జగిరి సంపత్, శ్రీధర్, వంశీ, మాజీ ఉప సర్పంచి మిట్టపల్లి సుభాష్, మిట్టపల్లి కుమారస్వామి, దాసరి ధనకర్, పి.రాజ్ కుమార్, అసిఫ్, అబ్దుల్ హకీమ్, భార్గవ్, వెంకటేష్, ఎల్లబోయిన శ్రీనివాస్, మేస్త్రీలు వోగ్గోజు సదయ్య, అంబాల సమ్మయ్య, ఇందిరమ్మ లబ్ధిదారులు, గ్రామ ప్రజలు, మండల నాయకులు పాల్గొన్నారు.
