(వాయిస్ ఆఫ్ భారత్, కల్చరల్) వరంగల్ నగరం ములుగు రోడ్ లోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో గురువారం వేయి జంటలతో నిర్వహించిన సామూహిక అనగాష్టమి వ్రతాలను భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏడు మార్గశిర బహుళ అష్టమి రోజున ప్రధాన అనగాష్టమి వ్రతాన్ని దత్త క్షేత్రంలో నిర్వహించడం ఆనవాయితీగా సాగుతోంది. నిర్వహణలో భాగంగా దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అనగాష్టమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు విద్య, వివాహాలు జరుగుతాయన్నారు. గురు అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు లభిస్తాయని వివరించారు. అనంతరం మహా మంగళ హారతి, నైవేద్యాల నివేదన చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వైవీ వామన్ రావు, డాక్టర్ కంటం లక్ష్మి నారాయణ, డాక్టర్ వద్దిరాజు శరవాణి, చకిలం ఏకాంబరం, విజేందర్ రెడ్డి, గ్రానైట్ శ్రీనివాస్, మేడిశెట్టి కుమారస్వామి, ఓం ప్రకాష్, వడిచర్ల శ్రీనివాస్ ఆలయ అర్చకులు రాపాక గోపి కృష్ణ శర్మ, ఆలయ మేనేజర్ వెలిది రవి, వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు.