ఆక్స్ ఫర్డ్ పాఠశాల విలువలతో కూడిన విద్యను నేర్పింది

ఆక్స్ ఫర్డ్ పాఠశాల విలువలతో కూడిన విద్యను నేర్పింది

వాయిస్ ఆఫ్ భారత్, కమలాపూర్ : ఆక్స్ ఫర్డ్ ఉన్నత పాఠశాలలో 2003-2004 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్థానిక ఉమా మహేశ్వర ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరైన పాఠశాల కరెస్పాండంట్ అక్కిన ప్రేంచందర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆక్సి్ఫార్డ్ ఉన్నత పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్ధికి విలువలతో కూడిన విద్యను అందించిందన్నారు. ఎంతో మంది ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారాని పేర్కొంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హాజరైన పూర్వ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2003-2004 సంవత్సరంలో విద్యార్థులకు బోధన చేసిన ఉపాధ్యాయులు వెంకన్న, పీఈటీ పబ్బు బాలరాజు, ఆంగ్ల ఉపాధ్యాయులు ఊకంటి మహేందర్, సైన్స్ ఉపాధ్యాయులు నక్క కిరణ్ కుమార్, గణిత ఉపాధ్యాయులు గొట్టే లక్ష్మణ్, రాఘవేంద్ర రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *