అయోధ్య క్రతువుకు ప్రముఖులకు ఆహ్వానం

అయోధ్య క్రతువుకు ప్రముఖులకు ఆహ్వానం
  • ఆహ్వానం అందుకున్న కాంతారా ఫేమ్‌ రిషబ్‌శెట్టి
  • మాజీ సిఎం కెసిఆర్‌కు అయోధ్య ఆహ్వానం

వాయిస్ ఆఫ్ భారత్ (నేషనల్ న్యూస్): ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవా నికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్‌ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానపత్రం పంపించారు. అయితే, ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్‌ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి.
అలాగే పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో భాగం కానున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు కూడా ఇందులో ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలు అందాయి . తాజాగా ప్రముఖ కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టికి కూడా అయోధ్య నుంచి పిలుపు అందింది. ఈ మేరకు తనకు కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందంటూ మురిసిపోయాడీ పాన్‌ ఇండియా స్టార్‌. ఈ మేరకు సోషల్‌ విూడియా వేదికగా తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు రిషబ్‌ శెట్టి. ’శ్రీరామ జయ రామ జయ జయ రామ. మేము చిన్నప్పటి నుంచి ఇళ్ళలో శ్రీరాముని ప్రవచనాలు, ఆయన ఆదర్శమైన జీవిత కథలను వింటూ పెరిగాం. ఇప్పుడు ఆ శ్రీరాముడే అయోధ్యకు రమ్మని మమ్మల్ని పిలిచాడు. ఇది నా పూర్వ జన్మ సుకృతం. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది.శ్రీరాముడికి జయం కలుగుగాక, అయోధ్యకు జయం కలుగుగాక’ అని ట్వీట్‌ చేశాడు రిషబ్‌ శెట్టి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ’జై శ్రీరామ్‌’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *