అయోధ్య కార్మికులకు ప్రధాని ప్రశంసలు

అయోధ్య కార్మికులకు ప్రధాని ప్రశంసలు
  • కార్మికులపై పూలవర్షం చల్లిన మోడీ

వాయిస్ అఫ్ భారత్ (నేషనల్ న్యూస్): అయోధ్య రామ మందిర్‌ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఆలయ నిర్మాణంలో భాగమైన కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ కార్మికులపై గులాబీ పూలవర్షం కురిపించారు. బుట్టలో పూలను తీసుకుని కూర్చున్న కార్మికులపై చల్లారు. ఇప్పటి వరకు విూరు దేవుడి ఆశీస్సులు పొందారని..ఇప్పుడు విూరు దేశం మొత్తం ఆశీస్సులు పొందుతున్నారని మోదీ అన్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రాణ ప్రతిష్టకు హాజరైన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. శ్రీరాముని పవిత్రోత్సవాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మొదటి దశ పనులు పూర్తి చేసి, అనంతరం శంకుస్థాపన చేశారు. దీని తరువాత చాలా పని మిగిలి ఉంది. ఈ మిగిలిపోయిన పనులకు సంబంధించి ప్రధాని మోదీ కార్మికులతో మాట్లాడుతూ.. తమ పనుల్లో వేగం పెంచాలన్నారు. రామమందిర నిర్మాణంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారని.. వారు పగలు, రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తున్నారని వారిని కలుసుకుని ప్రోత్సహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *