అకాల వర్షానికి తడిచిన ధాన్యం
వాయిస్ ఆఫ్ భారత్, మల్హర్ : మండలంలోని కొయ్యూరులో బుధవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి ఐకేపీ కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోయాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.
